ప్రజాస్వామ్యం గెలిచింది - అనిత
NEWS Aug 14,2025 04:14 pm
కడప జిల్లాలో జరిగిన ఒంటిమిట్ట, పులివెందులలో జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారని, ప్రజాస్వామ్యం గెలిచిందన్నారు మంత్రి వంగలపూడి అనిత. ఇన్నాళ్ల పాటు రాచరిక వ్యవస్థను అమలు చేసిన ఘనత జగన్ రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబుపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నది మీరు కాదా అన్నారు. రాజారెడ్డి రాజ్యాంగం చెల్లదని ఇప్పటికే 11 సీట్లకే పరిమితం చేసినా సిగ్గు రాలేదన్నారు. ఇకనైనా జగన్, తన టీం మారితే మంచిదని హితవు పలికారు.