సీఎంకు లేఖ రాసిన మండలి చైర్మన్
NEWS Aug 14,2025 03:52 pm
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తక్షణమే కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో గతంలో అప్పులు చేసి పనులు చేపట్టారని, తీరా ఇప్పటి దాకా చెల్లించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. తనను కలిసి వారి గోడు వెళ్ల బోసుకున్నారని మానవతా దృక్పథంతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని సూచించారు.