కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు
NEWS Aug 14,2025 12:19 pm
వాహనదారులకు బిగ్ షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. భారీగా వాహనాల లైఫ్ ట్యాక్స్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇవాల్టి నుంచే అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది. అదనపు ఆదాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పాట్లు పడుతోంది. కొత్త వాహనాల కొనుగోలు సమయంలో చెల్లించే లైఫ్ ట్యాక్స్ మొత్తాన్ని సవరించింది. వాహన ధరల ఆధారంగా ఇప్పటివరకు అమలులో ఉన్న శ్లాబులను పెంచటం ద్వారా ఆదాయం పొందాలని చూస్తోంది. అంతే కాకుండా వాహనాల ఫ్యాన్సీ నెంబర్ల ధరలను కూడా భారీగా పెంచాలని నిర్ణయించింది.