కన్నడ సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు దర్శన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు. అభిమాని హత్య కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది కర్ణాటక హైకోర్టు. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దావా చేయడంతో ఇవాళ విచారణ చేపట్టింది . బెయిల్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది కోర్టు.