నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేత
NEWS Aug 14,2025 10:22 am
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది ఉధృతంగా. పూర్తిగా నిండి పోవడంతో ప్రాజెక్ట్ 26 గేట్లు ఎత్తివేసి నీరు దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 2,52,840 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 2,92,826 క్యూసెక్కులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 588.40 అడుగులు, పూర్తి స్థాయి నీటి మట్టం 590.00 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 307.2834 టీఎంసీలు ఉండగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలుగా ఉంది.