ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి
NEWS Aug 14,2025 10:09 am
ఏపీలో వర్షాల తాకిడి కొనసాగుతోంది. ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. ఎగువన కురుస్తున్న వర్షాల తాకిడికి ప్రకాశం బ్యారేజ్‌కు కొనసాగుతోంది వరద ఉధృతి. దీంతో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. మొత్తం 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ప్లో, ఔట్‌ఫ్లో 3,97,250 క్యూసెక్కులు గా ఉంది. కృష్ణానది పరీవాహక ప్రాంత ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.