వరద బాధితులకు అండగా నిలవాలి
NEWS Aug 14,2025 09:56 am
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఇబ్బందులు పడుతున్న బాధితులకు అండగా నిలవాలని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అత్యవసర వైద్య అవసరాల కోసం కూడా అవసరమైనచోట మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సహాయక చర్యల్లో స్థానిక ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.