ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
NEWS Aug 14,2025 08:51 am
ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 3.44,638 క్యూసెక్కులు ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు మంత్రి వంగలపూడి అనిత. బాపట్ల, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు జిల్లా అధికారులు నదీపరివాహక లోతట్టు ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వాగులు, కాలువలు, కల్వర్టర్లు పొంగుతున్నందున ప్రమాద ప్రాంతాల్లో తప్పని సరిగా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.