ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలిః కమిషనర్
NEWS Aug 13,2025 10:34 pm
పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించే దిశగా పనిచేయాలని సూచించారు వరంగల్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్. నల్లబెల్లి స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన.. పలు రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, కోర్టు కేసులు ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు పారదర్శకంగా ప్రజలకు న్యాయం అందించాలని సూచించారు.