కోదండరాం, అలీ ఖాన్ ఎమ్మెల్సీ రద్దు
NEWS Aug 13,2025 05:08 pm
సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా నియమించిన కోదండరాం రెడ్డి, అలీఖాన్ ల నియామకం చెల్లదంటూ స్పష్టం చేసింది. వీరిద్దరి పదవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరి నియామకం రాజ్యాంగ విరుద్దం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, సత్యనారాయణలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కీలక తీర్పు వెలువరించడం కలకలం రేపింది.