దుండగులను ఎన్‌కౌంటర్ చేయాలి
NEWS Aug 13,2025 03:09 pm
చందానగర్ లో ఖజానా జ్యువెలర్స్ దోపిడీకి యత్నించిన దుండగులను ఎన్‌కౌంటర్ చేయాలన్నారు గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. ఉత్తర్ ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వ పాలనలో నేరస్తులు జైలులో ఉంటేనే బెటర్ అని అనుకుంటారని అన్నారు. బయటకు వస్తే ఎక్కడ ఎన్‌కౌంటర్ లో చనిపోతామనే భయం వారిలో ఉంటుందన్నారు. తెలంగాణలో కూడా ఎవరైనా దొంగతనం చేయాలంటే ఎన్‌కౌంటర్ చేస్తారేమో అనే భయం క్రియేట్ చేయాలని సర్కార్ ను డిమాండ్ చేశారు.