అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దు
NEWS Aug 13,2025 02:47 pm
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగర వాసులు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని కోరారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 72 గంటల పాట భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అప్రమత్తం చేసిందన్నారు. ఇప్పటికే సిబ్బందిని, ఇతర శాఖలను అప్రమత్తం చేశామన్నారు. లోతట్టు ప్రాంతాలను డిప్యూటీ కమిషనర్, స్థానిక తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.