తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు మంత్రి శ్రీధర్ బాబు. సెమీ కండక్టర్ మిషన్ కోసం తెలంగాణ అన్ని అనుమతులు ఇచ్చిందన్నారు. తెలంగాణ ప్రైమ్ లోకేషన్‌లో 10 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. ఏపీ ఒక ఎకరా కూడా కేటాయించకున్నా కేంద్రం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల మండిపడ్డారు. ఇలాంటి కేంద్ర విధానాలను తెలంగాణ సహించ బోదని వార్నింగ్ ఇచ్చారు.