చిత్రపురిలో సినీ కార్మికుల ఆందోళన
NEWS Aug 13,2025 12:07 pm
చిత్రపురి హౌసింగ్ సొసైటీలో రూ. 300 కోట్ల రూపాయల స్కాం జరిగిందంటూ సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. సొసైటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి పెరిగి పోయిందని, జవాబుదారీ తనం లోపించిందని వాపోయారు. సినీ కార్మికులు, నాయకులు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. నిజమైన సినిమా కార్మికులకు ఇళ్లు దక్కకుండా అన్యాయం చేస్తున్నారని, ఫ్లాట్లను బ్లాక్ మార్కెట్‌లో కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. వల్లభనేని అనిల్ కుమార్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.