చంద్రబాబు, పవన్ కు ఎన్టీఆర్ థ్యాంక్స్
NEWS Aug 13,2025 08:56 am
తాను నటించిన వార్ -2 మూవీ ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా ఏపీ సర్కార్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చింది. సహకరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు థ్యాంక్స్ తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. మూవీకి సంబంధించి అదనపు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా గురువారం రజనీకాంత్ నటించిన కూలీ కూడా రిలీజ్ కానుంది.