పుస్తక పాఠకులకు గ్రంథాలయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మొక్కలు నాటారు భద్రాద్రి జిల్లా సింగరేణియన్ మన్ కీ బాత్ ప్రకృతి ప్రేమికుడు కెఎన్ రాజశేఖర్. చిరిగిన చొక్కానైనా తొడుక్కో.. కానీ మంచి పుస్తకం కొనుక్కో..అనే నినాదంతో పుస్తకాలలోని జ్ఞానాన్ని అందరికీ అందించాలని దేశంలో గ్రంథాలయం ఏర్పాటుకు కృషి చేసిన డాక్టర్ ఎస్ఆర్.రంగనాథన్ జయంతి సందర్భంగా ఆయన మారేడు మొక్కను నాటి గ్రంథాలయ అధికారులకు, సిబ్బందికి, పాఠకులకు శుభాకాంక్షలు తెలిపారు.