నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఎస్.కోట, అరకు ఘాట్ రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారింది. అనంతగిరి మండలం డమకు బొర్రా జంక్షన్ మార్గ మధ్యలో అరుకు ఘాట్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. వాహన చోదకులు ఎటువైపు నుంచి ప్రమాదం సంభవిస్తుందోనని భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆర్ అండ్ బి అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి రోడ్డు మరమ్మత్తులు చేయాలని వాహన చోదకులు కోరుతున్నారు.