బీఆర్ఎస్ బీసీ బేరి సభ వాయిదా
NEWS Aug 12,2025 03:58 pm
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. ఈనెల 14న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో జరుప తలపెట్టిన బీసీ బేరీ సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశామని, కానీ వాతావరణ శాఖ భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయని ప్రకటించిందని, ముందు జాగ్రత్తగా సభను వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.