జస్టిస్ వర్మ పై అభిశంసన తీర్మానం చేపట్టేందుకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా దర్యాప్తు ప్యానల్ ను ఏర్పాటు చేశారు. ప్యానల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య ను నియమించారు. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించారు. ఇందులో 146 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాగా తన నివాసంలో భారీ మొత్తంలో సొమ్ము బయటపడిన కేసులో ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.