బీజేపీ చీఫ్ రామచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ తల్లి గుడి వద్దకు భారీగా తిరంగా ర్యాలీ చేపట్టాలని పిలుపునిచ్చారు. దీంతో శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నామని తెలిపారు పోలీసులు. తనను హౌస్ అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు బీజేపీ చీఫ్. రాష్ట్రంలో నైజాం తరహా పాలన కొనసాగుతోందని ఆరోపించారు. తన ఆరాధ్య దైవాన్ని కొలవడం, జాతీయ పతాకాన్ని ఎగుర వేయడం తన ప్రాథమిక హక్కు అని స్పష్టం చేశారు.