బంగారుమెట్ట PACS చైర్మన్‌గా దొండా శ్రీను
NEWS Aug 12,2025 11:38 pm
బుచ్చయ్యపేట మండలంలోని బంగారు మెట్ట PACS పర్సన్ ఇంచార్జ్ చైర్మన్‌గా మాజీ ఎంపీటీసీ దొండా శ్రీను నియమితులయ్యారు. సభ్యులుగా సాయం అయ్యన్న దొర, ఒంటెద్దు సాంబశివమూర్తి నియమితులయ్యారు. తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని దొండా శ్రీను తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే KSNS రాజుకు అభినందనలు తెలిపారు.