సృష్టి ఫెర్టిలిటీ కేసు సిట్ కు అప్పగింత
NEWS Aug 12,2025 02:51 pm
సృష్టి ఫెర్టిలిటీ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ ముగిసిందని తెలిపారు డీసీపీ రష్మీ పెరుమాళ్. ఈ కేసును సిట్ కు అప్పగించామని, ఇప్పటి దాకా 25 మందిని అరెస్ట్ చేశామన్నారు. చాలా మంది దంపతుల వద్ద రూ. 20 నుండి 30 లక్షలు డబ్బులు తీసుకున్నారని తెలిపారు. DNA టెస్ట్ మ్యాచ్ కాలేదని మరో ఫిర్యాదు వచ్చిందన్నారు. సరోగసి పేరుతో మోసం చేశారన్నారు. 15 కేసులు ఉన్నట్లు గుర్తించామని, అరెస్ట్ చేసిన వారిలో డాక్టర్లు, ఏజెంట్స్ కూడా ఉన్నారని చెప్పారు.