ఆశా వర్కర్లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. మొదటి రెండు ప్రసవాల కోసం 180 రోజులు (6 నెలలు) పూర్తి జీతంతో ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆశా వర్కర్ గా పని చేయడానికి గరిష్ట వయసు 62 సంవత్సరాలకు పెంచింది. సంవత్సరానికి నెలవారీ గౌరవ వేతనం రూ. 5 వేలు చెల్లిస్తుంది. గరిష్టంగా మొత్తం రూ లక్షన్నర వరకు చెల్లించాలని నిర్ణయించింది. రిటైర్‌మెంట్ తరువాత ఆర్థిక భద్రత అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.