ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తమపై నిరాధార ఆరోపణలు చేశారంటూ మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి. తమ పరువుకు నష్టం కలిగించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ఏమైనా ఆధారాలు ఉంటే చూపించాలే తప్పా ఇలా చవకబారు విమర్శలు చేయడం తగదంటూ స్పష్టం చేశారు . బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు కేటీఆర్.