భారత్‌పై భారీ టారిఫ్‌లు... రష్యాకు పెద్ద దెబ్బ: డొనాల్డ్ ట్రంప్
NEWS Aug 12,2025 10:48 am
రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నందుకు భారత్‌పై 50 శాతం భారీ సుంకాలు విధించామని, ఈ నిర్ణయం మాస్కో ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలేలా చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్‌హౌస్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ, అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాల వల్ల రష్యా ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతిందని అన్నారు.