ఉప ఎన్నిక కోసం జగన్ వంద కోట్లు ఖర్చు
NEWS Aug 12,2025 08:18 am
పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. జడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం మాజీ సీఎం జగన్ వంద కోట్లు ఖర్చు చేశారని అన్నారు. ఇంకా డబ్బులు పంచుతూనే ఉన్నారని మండిపడ్డారు. ముక్కు పుడకలు, చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. అవినీతి సొమ్మును గెలిచేందుకు కుమ్మరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు.