పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్బంగా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తన అరెస్ట్ పై ఎంపీ తీవ్రంగా ఖండించారు. ఎలాంటి ముందస్తు నోటీసు , సరైన కారణం లేకుండానే తనను అరెస్ట్ చేయడం పట్ల మండిపడ్డారు. పోలీసులు టీడీపీ గూండాల లాగా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపించారు. పోలింగ్ ఏజెంట్లపై దాడి జరిగిందని వాపోయారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందన్నారు.