మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకున్నారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. చిట్ చాట్ పేరుతో దారుణమైన కామెంట్స్ చేయడం పట్ల బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్‌లో కేసీఆర్ క్షుద్రపూజలు చేసినందుకే SLBC టన్నెల్ కూలిందంటూ నోరు పారేసుకోవడం పట్ల మండిపడ్డారు.