రచయిత్రి అనిశెట్టి రజిత ఇక లేరు
NEWS Aug 11,2025 11:05 pm
ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక (ప్రరవే) జాతీయ అధ్యక్షురాలు , రచయిత్రి అనిశెట్టి రజిత కొద్ది సేపటి క్రితం గుండెపోటుతో వరంగల్ లో తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల కవులు, రచయితలు, బుద్ది జీవులు, మేధావులు, కళాకారులు, జర్నలిస్టులు, ప్రజాస్వామిక వాదులు, వామపక్ష వాదులు, ప్రగతిశీల రచయితలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక వహించిన అనిశెట్టి రజిత లేక పోవడం తీరని లోటు అని పేర్కొన్నారు.