ప్రచారం కోసం జగన్ ప్రయత్నం
NEWS Aug 11,2025 10:59 pm
మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్ పై. పులివెందుల, ఒంటిమిట్టలలో జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందడం ఖాయమన్నారు. బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ అడపా దడపా వచ్చి పోవడం ,హల్ చల్ చేయడం తప్పా జగన్ చేసింది ఏమీ లేదన్నారు. ఆయనను ప్రజలు ఏనాడో తిరస్కరించారని, ఆ విషయం గుర్తిస్తే మంచిదన్నారు. కూటమి సర్కార్ వచ్చాక కీలక మార్పులు చోటు చేసుకున్నాయని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు.