వాహనదారులకు పోలీసుల హెచ్చరిక
NEWS Aug 11,2025 11:12 pm
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అనంతగిరి ఎస్ఐ శ్రీనివాసరావు సూచించారు. ములియగూడ జంక్షన్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. రైడర్లు, పిలియన్ రైడర్లు ఇద్దరూ హెల్మెట్ ధరించడంపై అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. నిబంధనలు పాటించని వారికి రూ.1000 జరిమానాతో పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.