పులివెందులలో ఓటుకు పది వేలు ఇస్తున్నారు: పేర్ని నాని
NEWS Aug 11,2025 08:16 pm
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం దిగజారి ప్రవర్తిస్తోందని, ఓటుకు పది వేల రూపాయలు ఆశచూపిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల ఇంటికి వెళ్తున్న టీడీపీ నేతలు.. ఓటర్ స్లిప్‌లు లాక్కుంటున్నారని.. ఇవ్వకపోతే ఓటర్లను బెదిరిస్తున్నారని తెలిపారు.