జగిత్యాల: ధర్మపురి పట్టణంలో నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం విచారణ జరిపి నిజానిజాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ప్రధాని మోదీ కనుసన్నల్లో పనిచేస్తుందని ఆయన ఆరోపించారు.