జగిత్యాల: ధర్మపురి జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆయన మాత్రలు పంపిణీ చేసి, పరిశుభ్రత ప్రాధాన్యతను వివరించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆరోగ్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.