మార్షల్స్ జీతాలు తగ్గించడం లేదన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. పాత జీత భత్యాలనే కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన వైఖరితో ఉన్నారని చెప్పారు. మార్షల్స్ జీతాలు తగ్గించడం కాదు, పెంచడానికే చూస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రాల పద్దతులను కూడా పరిశీలించి ముందుకెళ్లడానికి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.