బెట్టింగ్ యాప్స్ కేసులో రానాను దాదాపు నాలుగు గంటల పాటు విచారించింది ఈడీ. పలు ప్రశ్నలు సంధించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ సందర్బంగా తన బ్యాంక్ లావాదేవీల గురించి ఆరా తీశారు. వాటిని పరిశీలించారు. బెట్టింగ్ యాప్ కంపెనీ నుంచి ఎంత ట్రాన్సాక్షన్ జరిగిందనే దానిపై నిలదీశారు. తాను ఎలాంటి అక్రమ కంపెనీని ప్రమోట్ చేయలేదన్నారు రానా.