ఎన్నికల సంఘం నిర్వాకంపై ప్రశ్నించిన ఎంపీలు రాహుల్, ప్రియాంకతో పాటు ఇతరులను పోలీసులు అరెస్ట్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ర్యాలీ చేస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన ఎంపీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.