దొంగ ఓట్ల చేరికతో ఎన్నికల వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. దొడ్డిదారిలో బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్ నే కలుషితం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి కాపు కాయాల్సిన ఎన్నికల సంఘం మోడీకి కాపలా కాస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల కమిషన్ తీరు చూస్తే మేడిపండు చందంగా ఉందన్నారు. స్వతంత్ర వ్యవస్థ కాస్త బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు . దేశంలో ఎన్నికల కమిషన్ అంటే ఎలక్షన్ చోర్ కమిషన్ గా మారిందన్నారు. రాహుల్ చేసిన ఆరోపణలపై ఈసీ సమాధానం చెప్పాలన్నారు.