శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు
NEWS Aug 11,2025 12:52 pm
ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతోంది. ఇన్ ఫ్లో 1,53,098 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 65,800 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.20 అడుగులకు చేరుకుంది. పూర్తి స్దాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలుగా కాగా ప్రస్తుతం 194.3096 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతోంది విద్యుత్ ఉత్పత్తి.