నాగార్జున సాగర్ 5 క్రస్ట్ గేట్లు ఎత్తివేత
NEWS Aug 11,2025 12:47 pm
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఐదు క్రస్ట్ గేట్లు 5 ఫీట్లు ఎత్తి వేసి దిగువకు 64,384 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 65,800 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 1,09,708 క్యూసెక్కులకు చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 589.50 అడుగులకు చేరుకుంది. కాగా డ్యామ్ నీటి సామర్థ్యం 310.5510 టీఎంసీలకు చేరుకుంది. కుడి, ఎడమ కాలువలకు సాగు నీటిని విడుదల చేశారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా కొనసాగుతోంది విద్యుత్ ఉత్పత్తి.