సుంకేసులకు భారీగా వరద ఉధృతి
NEWS Aug 11,2025 12:37 pm
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు సుంకేసుల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 16 గేట్లు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 70,000 క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 67,312 క్యూసెక్కులకు చేరుకుంది. కెసి కెనాల్ కు 2,012 క్యూసెక్కులు విడుదల చేశారు. కాగా జలాశయం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసిలు ఉండగా ప్రస్తుత సామర్థ్యం 0.917 క్యూసెక్కులకు చేరుకుంది.