వాతావరణ శాఖ హెచ్చరిక మంత్రి సమీక్ష
NEWS Aug 11,2025 12:28 pm
వాతావరణ శాఖ హెచ్చరికలపై విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత సమీక్ష చేపట్టారు. కలెక్టర్లు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో మాట్లాడారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ నష్టం జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదించాలని కలెక్టర్లకు సూచించారు.