ఆడుదాం-ఆంధ్రా నిధుల దుర్వినియోగంపై విచారణ ముగిసింది. ఇవాళ ఏపీ ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు తయారు చేసిన నివేదికను అందజేసింది. పలు జిల్లాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. క్రీడా పరికరాల కొనుగోలులో కమీషన్ల వ్యవహారం నడిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, బెంగళూరు ప్రాంతాలకు చెందిన 6 సంస్థల నుంచి క్రీడా పరికరాల కొనుగోలు చేసినట్లు గుర్తించారు. విజేతలకు నగదు బహుమతుల కేటాయింపులోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు తేలింది.