తెలంగాణకు హై అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈనెల 14 నుంచి 17 వరకు అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని , ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. హైదరాబాద్ లోనూ ఒకట్రెండు రోజులు భారీగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. 15న భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అవసరమైతే బయటకు రావాలని సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.