కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం కసరత్తు
NEWS Aug 11,2025 08:44 am
ఏపీలో కొత్త జిల్లాలు రానున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నాయి. ఈ సంఖ్య 32కి పెరిగే ఛాన్స్ ఉంది. కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను ఎన్టీఆర్ జిల్లాలోకి మార్చే ఆలోచన చేస్తున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలు మళ్లీ ప్రకాశంలోకి కలుపుతారు. కొత్తగా మార్కాపురం, అమరావతి, గూడూరు, ఆదోని, పలాస, మదనపల్లి జిల్లాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.