ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు బెదిరింపులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తన వ్యాఖ్యలను ఖండిస్తూ గొంతు కోస్తామంటూ వార్నింగ్ ఇచ్చాడు బుల్లితెర నటుడు రవిచంద్రన్. తనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు కమల్ హాసన్ పార్టీ నాయకులు.