తిరుమలకు పోటెత్తిన భక్తులు
NEWS Aug 11,2025 08:24 am
తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిట లాడుతోంది. శ్రీవారిని 82 వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. 30 వేల 505 మంది తలనీలాలు సమర్పించారు. కానుకలు, విరాళాల రూపేణా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.78 కోట్లు వచ్చినట్లు తెలిపారు ఈవో జె. శ్యామల రావు. ప్రస్తుతం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఎలాంటి టోకెన్లు లేని భక్తులకు కనీసం 11 గంటలకు పైగా సమయం పడుతుందన్నారు.