నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 9కు సిద్ధమవుతోంది. తాజాగా నాగ్ \'ఎప్పుడైనా పాత సిలబస్ కొత్త ఎగ్జామ్ రాస్తావా\' అంటూ వెన్నెల కిషోర్‌ను ప్రశ్నించే ప్రచార వీడియో విడుదలైంది. ఇందులో వెన్నెల కిషోర్ హౌస్ లోకి వెళ్లేందుకు సిద్ధమవగా, సీజన్ లో నాగార్జున చెప్పిన కండీషన్స్ విని ఆయన ఆశ్చర్యపోయారు. \'ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్\' అంటూ షో ఆసక్తిని పెంచారు. బిగ్‌బాస్‌నే మార్చేశా అంటూ నాగ్ ట్విస్ట్ ఇచ్చారు. సామాన్యులకూ ఛాన్స్ ఇవ్వబోతున్నారు. త్వరలోనే సీజన్ 9 ప్రారంభం కానుంది.