వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం
NEWS Aug 10,2025 07:36 pm
ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు దెబ్బ తిన్నాయి. వీటిని పరిశీలించారు సీఎం రేవంత్ రెడ్డి. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అమీర్‌పేట్, బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గంగూబాయి బస్తీ కుంటను సందర్శించారు. బాలుడికి భరోసా ఇచ్చారు.