మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బచ్చాను కానంటూ పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన గువ్వల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో పార్టీ లో చేరారు. కేటీఆర్ కు బాలరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎంపీ ఎన్నికల్లో ఓడిపోతే తాను కుంగి పోలేదన్నారు. కానీ మీరు ఒక్కసారి ఓడిపోతే అసహనంతో ఎవరిని పడితే వాళ్లను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.